ama: ఏడున్నర గంటలు కూర్చున్నా తెగని అమరావతి డిజైన్లు... ఓకే చెప్పని చంద్రబాబు!

  • మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 11 వరకూ చర్చలు
  • నార్మన్ చీఫ్ తోనూ మాట్లాడిన చంద్రబాబు
  • కొలిక్కి రాని డిజైన్లు
  • నేడు మరోసారి చర్చించనున్న చంద్రబాబు బృందం

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో శాశ్వత అసెంబ్లీ, హైకోర్టు నమూనాలు ఇంకా ఖరారు కాలేదు. నిన్న మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ అంటే దాదాపు ఏడున్నర గంటల పాటు నార్మన్ పోస్టర్స్ కార్యాలయంలో కూర్చుని వారు చూపిన నమూనాలు, ప్రజెంటేషన్ ను తిలకించిన సీఎం చంద్రబాబు, ఇంకా కొంత అసంతృప్తితోనే ఉన్నట్టు తెలుస్తోంది.

నార్మన్ పోస్టర్స్ చీఫ్ లార్డ్ నార్మత్ తో కలసి చర్చలు జరిపిన తరువాత కూడా ఎటువంటి నిర్ణయాన్నీ చెప్పకుండా వెళ్లిపోయిన చంద్రబాబు, ఈ ఉదయం 11.30 గంటల సమయంలో (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటలు) మరోసారి నార్మన్ పోస్టర్స్ ఆఫీసుకు వెళ్లి నిన్న చెప్పిన మార్పులు, చేర్పుల తరువాత మారిన డిజైన్లను పరిశీలించనున్నారు.

ఇక లండన్ లో జరుగుతున్న నమూనాల పరిశీలనను విజయవాడలో ఉండి తిలకిస్తున్న ఎంపీ గల్లా జయదేవ్, పారిశ్రామికవేత్తలు సంజయ్ రెడ్డి, మండవ ప్రభాకర్, సీఆర్డీయే అధికారులు కూడా తమకు తోచిన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. నేటి సమావేశం తరువాత భవంతుల ఆకృతులపై ఓ నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ama
  • Loading...

More Telugu News