telangana: ఇన్స్యూరెన్స్ కంపెనీ ఏర్పాటును కేసీఆర్ అధ్యయనం చేస్తున్నారు: గుత్తా
- రైతులకు మేలు చేసేందుకే
- ఇప్పటికే గుజరాత్, పంజాబ్ లలో ఈ తరహా కంపెనీలు
- కేసీఆర్ అధ్యయనం చేస్తున్నారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఇన్స్యూరెన్స్ కంపెనీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందని టీఆర్ఎస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. రైతులను ఆదుకోవాలనే సదుద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకుందని చెప్పారు. పత్తి రైతుల కోసం ఇప్పటికే గుజరాత్, పంజాబ్ ప్రభుత్వాలు ఈ తరహా కంపెనీలను ఏర్పాటు చేసి, మంచి ఫలితాలను సాధించాయని తెలిపారు.
ఆ రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ సమాచారం తెప్పించుకున్నారని, లోటుపాట్లపై అధ్యయనం చేస్తున్నారని చెప్పారు. గత ఏడాదిలో పలు బ్యాంకుల ఇన్య్యూరెన్స్ విభాగాల లాభం రూ. 16 వేల కోట్ల వరకు ఉందని... రైతులకు రావాల్సినదాన్ని వారు లాభాల్లో చూపించుకుంటున్నారని తెలిపారు.