kaleshwaram: తెలంగాణాకు మోదీ సర్కారు గుడ్ న్యూస్.. కాళేశ్వరం ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్!
- కాళేశ్వరానికి తొలగిన అడ్డంకులు
- పర్యావరణ, అటవీ అనుమతులు ఇచ్చిన కేంద్రం
- 3,168 హెక్టార్ల భూమి ఇచ్చేందుకు నిర్ణయం
కె.చంద్రశేఖరరావు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చానాళ్లుగా ఎదురుచూస్తున్న కోరికను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చింది. ఐదు జిల్లాల ప్రజలకు సాగు, తాగు నీరందించే బహుళార్ధ సాధక ప్రాజెక్టు అయిన కాళేశ్వరానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిస్తూ, అనుకోని వరాన్ని ఈ ఉదయం ఇచ్చింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర సర్కారు లేఖను రాస్తూ, కాళేశ్వరం ప్రాజెక్టుకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం కోరిన అన్ని అనుమతులనూ మంజూరు చేస్తున్నట్టు తెలిపింది. ప్రాజెక్టు తొలి దశకు అవసరమైన అటవీ, పర్యావరణ అనుమతులు ఇస్తున్నామని, 3,168 హెక్టార్ల అటవీ భూమిని ప్రాజెక్టు పరిధిలోకి తీసుకునేందుకు ఆమోదం పలుకుతున్నామని పేర్కొంది. వెంటనే ప్రాజెక్టుకు సంబంధించిన పనులను చేపట్టాలని సూచించింది.