క్రికెట్ : రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం!
- రాణించిన శిఖర్ ధావన్ (68), దినేశ్ కార్తీక్ (64)
- మూడు వన్డేల సిరీస్‌లో చెరో వన్డే గెలిచిన న్యూజిలాండ్, భారత్
- ఫైనల్ మ్యాచ్ ఎవరు గెలిస్తే వారికే కప్
పూణేలో జరిగిన భారత్, న్యూజిలాండ్ రెండో వన్డేలో ఆరు వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ 68, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్ 64 పరుగులతో రాణించడంతో 4 ఓవర్లు మిగిలి ఉండగానే టీమిండియా 231 పరుగుల లక్ష్యాన్ని సాధించింది. టీమిండియా మిగతా బ్యాట్స్‌మెన్‌లో రోహిత్ శర్మ 7, కెప్టెన్ విరాట్ కోహ్లీ 29, హార్దిక్ పాండ్యా 30, ధోనీ 18 పరుగులు చేశారు.
న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌతీ, గ్రాంధోమీ, శాంటర్, ఆడమ్ మిల్నీ చెరో వికెట్ చొప్పున తీశారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి వన్డేలో న్యూజిలాండ్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ రోజు జరిగిన రెండో వన్డేలో టీమిండియా గెలవడంతో ఇరు జట్లు 1-1 తేడాతో సమ ఉజ్జీలుగా ఉన్నాయి. దీంతో సిరీస్ ఫలితాన్ని తేల్చే ఫైనల్ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది.