Einstein: ఐన్ స్టీన్ పుణ్యమాని ఆ హోటల్ ఉద్యోగి 'టిప్పు' సుల్తాన్ అయ్యాడు!
- 1922లో జపాన్ లో పర్యటించిన ఐన్ స్టీన్
- ఐన్ స్టీన్ కు సాయం చేసిన హోటల్ ఉద్యోగి
- టిప్పు ఇచ్చేందుకు డబ్బులు లేకపోవడంతో లేఖ రాసిన ఐన్ స్టీన్
ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతం గురించి అందరికీ తెలిసిందే... మరి ఈ ‘హ్యాపీనెస్’ సిద్ధాంతమేంటన్న అనుమానం వచ్చిందా? దాని వివరాల్లోకి వెళ్తే... 1922లో ఐన్ స్టీన్ జపాన్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బస చేసిన హోటల్ లో పనిచేసే వ్యక్తి ఆయనకు సాయం చేశాడు. దీంతో ఐన్ స్టీన్ ఆయనకు టిప్ ఇవ్వాలనుకున్నారు.
అయితే ఆ సమయంలో ఆయన వద్ద అందుకు డబ్బు లేకపోవడంతో, ఆయనకు ఒక లేఖ రాశారు. ఆ తరువాతి కాలంలో ఇది ఐన్ స్టీన్ 'హ్యాపీనెస్ సిద్ధాంతం'గా పేరొందింది. దీనిని విన్నర్స్ హౌస్ నిర్వాహకులు వేలం వేయగా 8.42 కోట్ల రూపాయల ధరకు అమ్ముడైందని నిర్వాహకులు తెలిపారు. ఈ రకంగా ఐన్ స్టీన్ ఆయనకు భారీ స్థాయిలో టిప్ ఇచ్చినట్టే లెక్క అని ఆయన అభిమానులు పేర్కొంటున్నారు.