chandrababu: ప్రధానమంత్రి పదవిపై చంద్రబాబు స్పందన!

  • గోల్డెన్ పీకాక్ అవార్డును అందుకున్న చంద్రబాబు
  • ప్రధాని అయ్యే అర్హతలు చంద్రబాబుకు ఉన్నాయన్న నిర్వాహకులు
  • నా పరిమితులు ఏంటో నాకు తెలుసన్న బాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్ఠాత్మక 'గోల్డెన్ పీకాక్ లీడర్ షిప్' అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు ప్రదానోత్సవం లండన్ లో జరిగింది. పబ్లిక్ సర్వీస్ అండ్ ఎకనామిక్ ట్రాన్స్ ఫర్మేషన్ విభాగంలో ఆయనకు ఈ అవార్డును అందజేశారు. బ్రిటన్ మంత్రి ప్రీతి పటేల్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఇదే వేదికపై చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కార్పొరేట్ గవర్నెన్స్ ఇన్ పబ్లిక్ సెక్టార్ విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డును స్వీకరించారు.

ఈ సందర్భంగా చంద్రబాబును సభికులకు పరిచయం చేస్తూ... భారత ప్రధాని అయ్యేందుకు అన్ని అర్హతలు చంద్రబాబుకు ఉన్నాయంటూ నిర్వాహకులు పేర్కొన్నారు. దీనికి సమాధానంగా, తాను ఒక ప్రాంతీయ పార్టీకి అధ్యక్షుడినని, తన పరిమితులు ఏంటో తనకు తెలుసని, ప్రధాని పదవికి తాను పోటీ కాదని, తన రాష్ట్రాన్ని ఉన్నతపథంలోకి తీసుకెళ్లడమే తన లక్ష్యమని చంద్రబాబు అన్నారు. ఏపీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, పెట్టుబడులతో రావాలంటూ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. 

  • Loading...

More Telugu News