aravind kejriwal: కేజ్రీవాల్ రాజకీయ జీవితంపై డాక్యుమెంటరీ... ట్రైలర్ చూడండి!
- `యాన్ ఇన్‌సిగ్నిఫికెంట్ మ్యాన్` పేరుతో డాక్యుమెంటరీ
- దర్శకత్వం వహించిన ఖుష్బూ రంక, వినయ్ శుక్లా
- నవంబర్ 17న విడుదల
2013లో ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. `ఆమ్ ఆద్మీ పార్టీ` పేరుతో ఆయన చేసిన ప్రచారం తక్కువ సమయంలోనే ఆయనను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టింది. ఇక అప్పటి నుంచి ఆయన ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి ఆయన రాజకీయ జీవితం గురించి డాక్యుమెంటరీ తీయాలనే ఆలోచన రావడం సహజమే. అదే ఆలోచన దర్శకులు ఖుష్బూ రంక, వినయ్ శుక్లాలకు వచ్చింది. వెంటనే `యాన్ ఇన్‌సిగ్నిఫికెంట్ మ్యాన్` పేరుతో ఓ డాక్యుమెంటరీ తీశారు. దానికి సంబంధించిన ట్రైలర్ నిన్న విడుదలైంది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుదల, కేజ్రీవాల్ సీఎం కావడం, తర్వాత పార్టీ నుంచి ముఖ్య నేతలు వెళ్లిపోవడం ఇలా అన్ని అంశాలను జోడించి ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ప్రతిపక్షాల దృష్టిని కూడా డాక్యుమెంటరీలో చూపించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 50కి పైగా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైన ఈ డాక్యుమెంటరీని నవంబర్ 17న ప్రేక్షకుల కోసం థియేటర్లలో విడుదల చేయనున్నారు.