క్రికెట్ : కోహ్లీ విశ్రాంతి కోరాడా?.. ఇటువంటి వార్తలు రావడం బాధాకరం: రాహుల్ ద్రవిడ్
- డిసెంబర్లో తనకు విశ్రాంతి కావాలని కోహ్లీ కోరినట్లు ప్రచారం
- కోహ్లీ అభ్యర్థనను బీసీసీఐ తిరస్కరించిందని వార్తలు
- ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని తేల్చి చెప్పిన ద్రవిడ్
- అనవసరపు వివాదాన్ని రేపొద్దు
ఈ ఏడాది డిసెంబర్లో తనకు విశ్రాంతి కావాలని, శ్రీలంకతో జరిగే సిరీస్ నుంచి తనను తప్పించాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బీసీసీఐను కోరినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. డిసెంబరులో కోహ్లీ తన ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్కను పెళ్లి చేసుకుంటున్నాడని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే, కోహ్లీ విశ్రాంతి కోరితే ఆయన అభ్యర్థనను బీసీసీఐ తిరస్కరించిందని కూడా వార్తలు వస్తున్నాయి. వీటన్నింటిపై స్పందించిన టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు.
శ్రీలంకతో సిరీస్ కు కోహ్లీ విశ్రాంతి కోరిన విషయం వాస్తవం కాదని ద్రవిడ్ అన్నారు. ప్రతి ఒక్కరికీ విశ్రాంతి అనేది అవసరమని తెలిపారు. ఆ క్రమంలో కోహ్లీకి విశ్రాంతి కావాలంటే తీసుకునే అవకాశం ఉందని, అంతేకానీ ఇటువంటి వార్తలు రావడం బాధాకరమని వ్యాఖ్యానించారు. అనవసరపు వివాదాన్ని రేపొద్దని సూచించారు.