xi jinping: యుద్ధానికి నిత్యం సిద్ధంగా ఉండండి.. ఆర్మీకి చైనా అధ్యక్షుడి ఆదేశం!
- అధ్యక్షుడిగా రెండోసారి పదవీ కాలాన్ని ప్రారంభించిన జిన్‌పింగ్
- యుద్ధానికి నిత్యం సన్నద్ధంగా ఉండాలని ఆదేశం
- సంస్కరణల విషయంలో దేశానికే ఆదర్శం కావాలని పిలుపు
ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యంగా పేరుగాంచిన ‘రెడ్ ఆర్మీ’ని యుద్ధానికి నిత్యం సన్నద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడిగా రెండో దఫా పదవీకాలాన్ని ఆరంభించిన జిన్‌పింగ్ ఆదేశించారు. జిన్‌పింగ్ గత వారం కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్షుడిగా, సైన్యాధిపతిగా, దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో రెండోసారి పదవీకాలన్ని ప్రారంభిస్తూ సైన్యాధికారులతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మీ ఎప్పుడూ చైనా కమ్యూనిస్టు పార్టీకి విధేయంగా ఉండాలన్నారు. యుద్ధాల్లో గెలవడంపై దృస్టి సారించాలని అన్నారు. సంస్కరణలు, ఆధునికీకరణలో దేశానికి సైన్యం మార్గదర్శిగా నిలవాలని పిలుపునిచ్చారు. కాగా, సైన్యంలోని ముఖ్య అధికారులతో భేటీకి ఇద్దరు జనరల్ స్థాయి అధికారులు హాజరు కాలేదు. అవినీతి ఆరోపణలతో గత నెలలోనే వీరిని విధుల నుంచి పక్కనపెట్టారు. ఈ కారణంగా వీరు అధ్యక్షుడితో భేటీకి హాజరు కాలేదని తెలుస్తోంది.