praksham: ఎమ్మెల్యే ఆమంచి సోదరుడి ఇంట్లో దొంగలుపడ్డారు!
- వైద్యపరీక్షల నిమిత్తం హైదరాబాదు వెళ్లిన ఆమంచి సీతయ్య కుటుంబం
- తాళం వేయడాన్ని గమనించి తలుపులు పగులగొట్టిన దుండగులు
- 50 సవర్ల బంగారు ఆభరణాలు, 25 కేజీల వెండి సామగ్రి, 16 లక్షల రూపాయల నగదు దోపిడీ
ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడి ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. చీరాల-ఒంగోలు ప్రధాన రహదారిని ఆనుకుని పందిళ్లపల్లిలో గల ఆమంచి సీతయ్య ఇంట్లో దొంగలు పడ్డారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన కుటుంబం ఈనెల 25న హైదరాబాదు వెళ్లడంతో ఇంటికి తాళం వేశారు.
దీనిని గమనించిన దుండగులు తలుపులు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఆయన నివాసం తలుపులు తెరిచి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఇంట్లోని 250 సవర్ల బంగారు ఆభణాలు, 25 కేజీల వెండి సామగ్రి, 16 లక్షల రూపాయల నగదు దోపిడీకి గురైనట్లు సీతయ్య బావమరిది ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.