Pakistan: భారత్ కు ఆ డ్రోన్లు అమ్మొద్దు: అమెరికాను వేడుకుంటున్న పాకిస్థాన్
- భారత్ కు ఆర్మ్ డ్ డ్రోన్లు, మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజిమీ (ఎంటీసీఆర్)ని అందించవద్దు
- భారత్ కు ఆ రెండు టెక్నాలజీలు ఇస్తే సరిహద్దు దేశాలకు ఇబ్బంది
- మేము ఆసియాలో ప్రాంతీయ స్థిరత్వం కోసం పాటుపడుతున్నాం
భారత్ కు ఆర్మ్ డ్ డ్రోన్లను విక్రయించవద్దని అమెరికాను పాకిస్తాన్ వేడుకుంటోంది. భారత్ కు శక్తిమంతమైన ఆర్మ్ డ్ డ్రోన్ల విక్రయం వల్ల ఆసియాలో ఆయుధ సమతుల్యం, శాంతి దెబ్బతింటాయని పాక్ పేర్కొంటోంది. సరిహద్దు దేశాలతో భారత్ ఆయుధ పెత్తనం చేసే అవకాశముందని, అందుకే వాటిని భారత్ కు విక్రయించవద్దని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ను పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీస్ జకారియా కోరారు.
ఆసియాతో పాటు సరిహద్దు దేశాలతో ప్రాంతీయ స్థిరత్వం కోసం పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే సైనిక, ఆయుధ సంపత్తిలో ముందున్న భారత్ కు ఆర్మ్ డ్ డ్రోన్లు అందజేయడం పొరుగు దేశాలకు ఇబ్బందికరమని ఆయన సూచించారు. అందుకే భారత్ కు ఆర్మ్ డ్ డ్రోన్లు, మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజిమీ (ఎంటీసీఆర్) సాంకేతికతను అందించవద్దని సూచించారు. భారత్ కు చేస్తున్న బహుపాక్షిక ఎగుమతి పద్ధతులను సమీక్షించాలని ఆయన సూచించారు. భారత్ కు ఈ రెండు సాకేతిక సౌకర్యాలను అందజేయడమంటే పాకిస్థాన్ ను ఫణంగా పెట్టడమేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.