cow: గోవులతో తొక్కించుకుంటోన్న యువకులు.. మీరూ చూడండి!
- మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని పట్టణ పరిసర ప్రాంతాల్లో ఆచారం
- వందల సంఖ్యలో గోవులు
- సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొంటోన్న భక్తులు
- భవిష్యత్తు బాగుంటుందని నమ్మకం
భారత్‌లో హిందువులు ఆవును గోమాతగా పూజిస్తారన్న విషయం తెలిసిందే. ఆవును పూజిస్తే సకల దేవతారాధన చేసినట్లేనని భావిస్తారు. అయితే, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని పట్టణ పరిసర ప్రాంతాల్లో యువకులు గోవులతో తొక్కించుకుంటున్నారు. వందల సంఖ్యలో గోవులు ఆ యువకుల మీదుగా వెళ్లగా, ఆ యువకుల్లో కొందరికి తీవ్రగాయాలయ్యాయి. ఇలా చేస్తే తమకు మంచి జరుగుతుందని వారు భావిస్తున్నారు.
ఈ ఆచారం కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. గత 100 ఏళ్లుగా దీన్ని పాటిస్తున్నారు. ప్రతి ఏడాది దీపావళి తర్వాత వచ్చే ఏకాదశి రోజున నిర్వహిస్తారు. సుదూర ప్రాంతాల నుంచి కూడా ఉజ్జయినికి తరలి వచ్చి, గోవులకు రంగులు, దండలు వేసి వాటితో తొక్కించుకుంటున్నారు.