Americans: భారత్‌తో మరింత బలమైన రక్షణ సంబంధాలను కోరుకుంటున్నాం: అమెరికా
- ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, భారత్ పర్యటనలో టిల్లర్సన్
- ఆయన అమెరికాకు రాగానే ఓ నిర్ణయం తీసుకుంటాం
- ఇరు దేశాల మధ్య సత్సంబంధాలకు యుద్ధ విమానాల అమ్మకాలు కీలకపాత్ర
- మీడియాకు వివరించిన అమెరికా దక్షిణ, మధ్య ఆసియా సంబంధాల కార్యదర్శి
భారత్, అమెరికాల మధ్య ఏర్పడ్డ వ్యూహాత్మక భాగస్వామ్యం 21వ శతాబ్దాన్ని ప్రభావవంతం చేస్తుందని అమెరికా దక్షిణ, మధ్య ఆసియా సంబంధాల కార్యదర్శి జీ వెల్స్ అన్నారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... భారత్‌తో తాము మరింత బలమైన రక్షణ సంబంధాలను కోరుకుంటున్నామని చెప్పారు. అలాగే ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పర్చుకోవడం వల్ల భారత్, అమెరికా మధ్య వాణిజ్యం గణనీయంగా పెరుగుతుందని అన్నారు.
ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడడంలో ఎప్-16, ఎఫ్-18 యుద్ధ విమానాల అమ్మకాలు కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. తమ దేశ విదేశాంగ మంత్రి టిల్లర్సన్ ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, భారత్‌ల పర్యటన ముగించుకుని తిరిగి రాగానే ఓ ముఖ్య విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశముందని ఆమె తెలిపారు.