barcelona: బార్సిలోనాలో ప్రతిధ్వనిస్తున్న హిందూ మంత్రం... ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది లైక్ చేసిన వీడియో ఇది!

  • అండర్ గ్రౌండ్ పాస్ లో గాయత్రీ మంత్రాన్ని పాడుతున్న మహిళ
  • భారతీయులకు వినయంగా నమస్కారం
  • సోషల్ మీడియాలో వైరల్

అది బార్సిలోనా లోని మెట్రో రైల్వే స్టేషన్. అక్కడ ఒక ప్లాట్ ఫామ్ నుంచి మరో ప్లాట్ ఫామ్ పైకి వెళ్లడానికి అండర్ గ్రౌండ్ పాస్ ఉంది. ఆ దారిలో సాయంత్రం వెళ్లే వారు ఎవరైనా హిందువులు పరమ పవిత్రంగా భావించే గాయత్రీ మంత్రాన్ని వినవచ్చు. స్పెయిన్ లో ప్రస్తుతం స్వాతంత్ర్యం కోసం నినదిస్తున్న కాటలోనియా ప్రాంతంలో ఉన్న అతిపెద్ద నగరం బార్సిలోనియా.

ఓ 50 ఏళ్ల వృద్ధురాలు ఇక్కడి అండర్ గ్రౌండ్ పాస్ లో కూర్చుని, చిన్న మైక్ పెట్టుకుని "ఓం... " అంటూ గాయత్రీ మంత్రాన్ని లయబద్ధంగా ఆలపిస్తుంటారు. ఆవైపు వచ్చే భారతీయులకు ఆమె సవినయంగా నమస్కరిస్తుంటారు. ఇటుగా వచ్చిపోయే వాళ్లు సైతం గాయత్రీ మంత్రాన్ని ఆమెతో పాటు ఆలపిస్తూ వెళుతుంటారు. ఈ వీడియోను ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పెట్టగా, కోట్లాది మంది దీన్ని చూసి ఇష్టపడ్డట్టు ప్రకటించారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News