stomach: మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్య‌క్తి క‌డుపులో 639 మేకులు.. బ‌య‌ట‌కు తీసిన కోల్‌క‌తా డాక్ట‌ర్లు!

  • స్క్రీజోఫ్రీనియాతో బాధ‌ప‌డుతున్న వ్య‌క్తి
  • కొద్దికాలంగా మేకులు, మ‌ట్టి తింటున్న వైనం 
  • దాదాపు రెండు గంట‌లు ప‌ట్టిన శ‌స్త్ర‌చికిత్స‌


కోల్‌క‌తాలోని ఉత్త‌ర 24 ప‌ర‌గ‌ణా జిల్లాలో గోబ‌ర్దంగా ప్రాంతానికి చెందిన ఓ 48 ఏళ్ల‌ స్క్రీజోఫ్రీనియాక్ పేషెంట్ క‌డుపులో నుంచి 639 మేకుల‌ను డాక్ట‌ర్లు బ‌య‌ట‌కు తీశారు. క‌ల‌క‌త్తా మెడిక‌ల్ క‌ళాశాల‌, ఆసుప‌త్రి వైద్యులు దాదాపు రెండు గంట‌ల పాటు శ‌స్త్ర చికిత్స చేసి ఈ మేకుల‌ను అయ‌స్కాంతం ద్వారా బ‌య‌ట‌కు తీశారు. వీటి బ‌రువు దాదాపు కేజీ వ‌ర‌కు ఉన్న‌ట్లు డాక్ట‌ర్లు తెలియ‌జేశారు.

మానసిక వ్యాధి స్క్రీజోఫ్రీనియా కార‌ణంగా వివేచన కోల్పోయిన సదరు రోగి, గ‌త కొద్దికాలంగా మేకులు, మ‌ట్టి తిన‌డం వ‌ల్ల ఇటీవ‌ల క‌డుపు నొప్పి వ‌చ్చింది. దీంతో వైద్యులు ఎక్స్‌రే తీయించగా, క‌డుపులో మేకులు ఉన్న‌ట్లు తెలిసింది. శ‌స్త్ర‌చికిత్స ద్వారా వాటిని తొల‌గించేందుకు పొత్తి క‌డుపు ద‌గ్గ‌ర చిన్న గాటు పెట్టి, మేకులు, మ‌ట్టిని బ‌య‌ట‌కు తీసినట్టు డాక్ట‌ర్ సిద్ధార్థ బిశ్వాస్ తెలిపారు. ఒక్కో మేకు 2 నుంచి 2.5 అంగుళాల పొడ‌వుంద‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌స్తుతం పేషెంట్ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని బిశ్వాస్ వెల్ల‌డించారు.

  • Loading...

More Telugu News