paripoornananda: తెలుగు రాష్ట్రాల్లో ప‌రిపూర్ణానంద ఆధ్వ‌ర్యంలో ' రాష్ట్రీయ హిందూ సేన ' ఆవిర్భావం.. భావోద్వేగపూరితంగా మాట్లాడిన శ్రీపీఠాధిప‌తి!

  • సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ తహసీల్ గ్రౌండ్ లో ఆవిర్భావ సభ
  • హిందువులంతా ఒక మహా శక్తిగా ఏక‌మ‌వ్వాలి
  • దేశంలో 80 శాతం మెజారిటీతో ఉన్న హిందువుల‌పై దాడులు జ‌రగ‌డం ఏంటి?
  • మ‌న దేశంలో మ‌న ధ‌ర్మం కోసం మ‌నం పోరాడాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది

భారతీయ సంస్కృతిని, హిందూ ధ‌ర్మాన్ని కాపాడుకోవాలని శ్రీపీఠాధిప‌తి స్వామి ప‌రిపూర్ణానంద అన్నారు. ఈ రోజు స్వామి పరిపూర్ణానంద జన్మదినం సందర్భంగా ఆయ‌న ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ తహసీల్ గ్రౌండ్ లో ' రాష్ట్రీయ హిందూ సేన ' ఆవిర్భావ సభ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ప‌రిపూర్ణానంద మాట్లాడుతూ.. హిందువులంతా ఒక మహా శక్తిగా, కులాలు, ప్రాంతాలు, వర్గాలకు అతీతంగా ఏక‌మ‌వ్వాల‌ని పిలుపునిచ్చారు. దేశంలో 80 శాతం ఉన్న హిందువుల‌పై దాడులు జ‌ర‌గ‌డం సిగ్గుచేట‌ని అన్నారు.

మ‌న దేశంలో మ‌న ధ‌ర్మం కోసం మ‌నం పోరాడాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింద‌ని ప‌రిపూర్ణానంద అన్నారు. కులాల మీద పుస్త‌కాలు రాస్తున్నారు, మ‌మ్మ‌ల్ని కాపాడండి అని బాధప‌డుతోన్న ప‌రిస్థితి వ‌స్తోంద‌ని అన్నారు. ఏ దేశంలోనూ ఇటువంటి ప‌రిస్థితి ఉండ‌దని వ్యాఖ్యానించారు. హిందూ ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ కోసం రాష్ట్రీయ హిందూ సేనను ఆయన ఏర్పాటు చేశారు.

మ‌న ధ‌ర్మానికి ప్రాంతాలు, కులాలు వేరైనా, భాష‌, యాస వేరుగా ఉన్న మ‌న హిందూ ధర్మం ఒక్క‌టేన‌ని చెప్పారు. 'ఏ శక్తి అందించెనో కద... సూర్యుడికంతటి వేడి.. మరి ఏ శక్తి నడింపించునో కద.. భూమిని తప్పనిగాడి..' అని తెలుగులో రాసిన పాట‌ను త‌మ సేన గేయంగా పెట్టుకున్నారు. 

  • Loading...

More Telugu News