anupama shenoy: కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన మాజీ పోలీస్ అధికారిణి అనుపమ

  • అక్రమార్కులపై ఉక్కుపాదం మోపిన అనుపమ
  • ప్రభుత్వ వైఖరితో విసుగు చెంది రాజీనామా
  • భారతీయ జనశక్తి కాంగ్రెస్ పార్టీ స్థాపన

కర్ణాటక కూడ్లిగిలో డీఎస్పీగా పని చేస్తూ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెట్టేలా చేసిన మాజీ డీఎస్పీ అనపమ షణై అందరికీ గుర్తుండే ఉంటారు. ఉద్యోగంలో ఉండగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆమె కొరకరాని కొయ్యలా మారారు. చివరకు ఒక మంత్రితో గొడవకు దిగి డీఎస్పీ ఉద్యోగానికి ఆమె రాజీనామా చేశారు. తాజాగా ఆమె 'భారతీయ జనశక్తి కాంగ్రెస్' పేరుతో సొంత పార్టీని స్థాపించారు. కూడ్లిగిలో తన అభిమానులు, పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి, పార్టీ పేరును ప్రకటించారు. కేసరి తెలుపు, పచ్చ రంగులతో కూడిన పార్టీ జెండాను ఆవిష్కరించారు.

పట్టణంలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూజలు నిర్వహించిన అనంతరం, పెద్ద ఎత్తున ఊరేగింపుతో పంచారణ్య కళ్యాణమంటపంలో ఆమె కొత్త పార్టీని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలతో ప్రజలు విసుగు చెందారని చెప్పారు. తమ పార్టీకి ప్రజల మద్దతు ఉంటుందని తెలిపారు. కర్ణాటకను అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లేలా తమ పార్టీ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ప్రజలకు సేవ చేయాలన్న తపన, నాయకత్వ లక్షణాలు ఉన్న వారిని పార్టీలో చేర్చుకుని, అసెంబ్లీలో అడుగుపెడతామని తెలిపారు. 80 లేదా అంతకన్నా స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. 

  • Loading...

More Telugu News