maheshbabu: మహేశ్ 25వ సినిమా కోసం న్యూయార్క్ లో మ్యూజిక్ సిటింగ్స్

  • 'భరత్ అను నేను' షూటింగులో మహేశ్ 
  • 25వ సినిమాకి మొదలైన సన్నాహాలు 
  • అందుకు సంబంధించిన పనుల్లో వంశీ పైడిపల్లి 
  • త్వరలోనే మిగతా నటీనటుల ఎంపిక

ఒక వైపున మహేశ్ 24వ చిత్రంగా 'భరత్ అను నేను' చకచకా షూటింగ్ జరుపుకుంటోంది. మరో వైఫున ఆయన 25వ చిత్రానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చురుకుగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ ను సిద్ధం చేసేసిన దర్శకుడు వంశీ పైడిపల్లి, ప్రస్తుతం న్యూయార్క్ లో జరుగుతోన్న మ్యూజిక్ సిటింగ్స్ లో బిజీగా వున్నాడు.

ఈ సినిమా షూటింగ్ కి లొకేషన్స్ ను ఎంపిక చేయడానికి నిర్మాత దిల్ రాజు .. వంశీ పైడిపల్లి ఇటీవల న్యూయార్క్ వెళ్లారు. అక్కడే మ్యూజిక్ సిటింగ్స్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ఉండటంతో, దేవిశ్రీ ప్రసాద్ కూడా వాళ్లతో వెళ్లారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన 3 పాటలను ఫైనల్ చేశారట. వచ్చే ఏడాదిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. హీరోయిన్ తో పాటు మిగతా నటీనటులను త్వరలోనే ఎంపిక చేస్తారట.        

  • Loading...

More Telugu News