narayana college: నారాయణ కాలేజీకి భారీ జరిమానా విధించిన అధికారులు!
- రూ. 10 లక్షల జరిమానా
- విద్యార్థి ఆత్మహత్యపై అధికారుల విచారణ
- యాజమాన్యం, సిబ్బంది తప్పుందన్న అధికారులు
నారాయణ కాలేజీ యాజమాన్యానికి అధికారులు భారీ షాక్ ఇచ్చారు. కడప జిల్లాలోని నారాయణ కాలేజీకి రూ. 10 లక్షల జరిమానా విధించారు. ఈ విషయాన్ని ఆర్ఐఓ రవి తెలిపారు. వివరాల్లోకి వెళ్తే, కడప జిల్లా రాయచోటిలో ఉన్న కళాశాలలో అధికారులు నిన్న ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ, కాలేజీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సమగ్ర విచారణ జరిపామన్నారు. విద్యార్థి ఆత్మహత్య విషయంలో కాలేజీ యాజమాన్యం, సిబ్బంది తప్పు ఉన్నందున, జరిమానా విధించామని చెప్పారు. విద్యార్థులపై ప్రభుత్వ కాలేజీలు కానీ, ప్రైవేట్ కాలేజీలు కానీ ఒత్తిడి పెంచితే చర్యలు తప్పవని హెచ్చరించారు.