pizza: ఇద్దరికీ మాత్రమే సరిపోయే ఈ పిజ్జా ధర అక్షరాల రూ. 77 లక్షలు
- ప్రపంచంలో అత్యంత ఖరీదైన పిజ్జా
- ఈ పిజ్జా పేరు లూయిస్ 13
- అరుదైన పదార్థాలు వాడటమే ఈ ధరకు కారణం
పిజ్జా పేరు చెప్పగానే నేటి తరానికి నోరూరుతుంది. చూడటానికి అన్ని పిజ్జాలు ఒకేలా కనిపించినా దాని తయారీకి ఉపయోగించే టాపింగ్స్, పదార్థాల ఆధారంగా వాటి రుచి, ధర మారతాయి. ఇటలీకి చెందిన పిజ్జా తయారీ నిపుణుడు రెనాటో వయోలా తన బృందంతో కలిసి ఓ పిజ్జాను తయారు చేశాడు. దీని ధర అక్షరాల రూ. 77 లక్షలు. ఇది కేవలం ఇద్దరు తినడానికి మాత్రమే సరిపోతుంది. ఆ పిజ్జా పేరు లూయిస్ 13. మరి ఈ పిజ్జాకు ఇంత ధర పెట్టడానికి కారణం ఏంటో తెలుసా... దాని టాపింగ్స్‌గా వాడే పదార్థాలే!
చాలా అరుదుగా లభించే పదార్థాలను ఈ పిజ్జా తయారీకి ఉపయోగిస్తారు. ఇందులో ఆస్ట్రేలియన్ పింక్ సాల్ట్, బ్లాక్ కైవర్ శాంపైన్, సేంద్రీయంగా ఉత్పత్తి అయిన మోజరెల్లా ఛీజ్, వైన్‌లో నానబెట్టిన నార్వే లాబ్‌స్టార్ మాంసం, మధ్యదరా సముద్రం ప్రాంతంలో దొరికే రొయ్యలు, మిడతలను ఈ పిజ్జా తయారీకి వినియోగిస్తారు. ఇవి యూరప్‌లో చాలా అరుదుగా లభించే పదార్థాలు. వీటిని ఒక పద్ధతిలో ఉడికించి పిజ్జా టాపింగ్స్‌గా ఉపయోగిస్తామని రెనాటో చెప్పాడు.