UNO: భారత్ తో సంబంధాలకు చైనా గొప్ప ప్రాధాన్యతనిస్తోంది: చైనా విదేశాంగ సహాయ మంత్రి
- ఐక్యరాజ్యసమితిలో చైనా తీరుపై మండిపడుతున్న భారత రక్షణ రంగ నిపుణులు
- చేతలతో ఇబ్బంది పెట్టి, మాటలతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన చైనా
- భారత్ తో బంధం ముఖ్యమన్న చైనా విదేశాంగ సహాయమంత్రి
భారత్ తో సంబంధాలకు చైనా గొప్ప ప్రాధాన్యతనిస్తోందని చైనా విదేశాంగ శాఖ సహాయ మంత్రి చెన్ జియావోడాంగ్ తెలిపారు. ఐక్యరాజ్యసమితిలో మసూద్ అజర్ పై అంతర్జాతీయ తీవ్రవాదిగా ముద్ర వేసేందుకు భారత్ చేసిన ప్రయత్నాలను అడ్డుకున్న నేపథ్యంలో చైనా తీరుపై భారతీయ రక్షణ రంగ నిపుణులు మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన ఆయన మాట్లాడుతూ, ద్వైపాక్షిక సంబంధాలు నిలకడగా వృద్ధి చెందే విధంగా భారతదేశంతో కలిసి కృషి చేసేందుకు తాము సిద్ధమని అన్నారు. భారతదేశం చైనాకు చాలా ముఖ్యమైన పొరుగు దేశమని, భారత్ తో సంబంధాలకు చైనా చాలా ప్రాముఖ్యతనిస్తోందని అన్నారు.