Selfie video: చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకుని తల్లిదండ్రులకు పంపించిన యువకుడు!
- ఓ అమ్మాయి ప్రేమించి మోసం చేసిందని చెప్పిన సాయి చైతన్య అనే యువకుడు
- తనపై కేసు పెట్టిందని కన్నీరు
- పోలీసులు కూడా వేధిస్తున్నారని ఆరోపణ
- యువకుడి కోసం పోలీసుల గాలింపు
మేడ్చల్లో సాయి చైతన్య అనే ఓ యువకుడు తల్లిదండ్రులకు సెల్ఫీ వీడియో పంపి కంగారు పెట్టాడు. తాను ప్రేమించిన యువతి తనను మోసం చేసి, వదిలి వెళ్లిపోవడమే కాకుండా తనపై తప్పుడు కేసు పెట్టిందని ఆరోపించాడు. ఆ యువతే మోసం చేసిందని పోలీసులకు చెప్పినప్పటికీ పట్టించుకోలేదని చెప్పాడు. అన్నీ తానేనని చెప్పి ఎన్నో మాయమాటలు చెప్పిందని, చివరికి తనను పెళ్లి చేసుకోనని చెప్పిందని ఏడుస్తూ చెప్పాడు.
తనను పోలీసులు కూడా వేధిస్తున్నారని అన్నాడు. ఈ జీవితం అంటే ఏంటో తనకు అర్థం కావట్లేదని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. తనను ఇష్టపడుతోన్న వారందరికీ థ్యాంక్స్ చెబుతున్నానని, తాను చనిపోయిన తరువాత తనను వేధించినవారిపై కేసులు పెట్టండని అన్నాడు. తనను క్షమించాలని, తాను వెళ్లిపోతున్నానని చెప్పాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువకుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.