suneetha: అమ్మాయిలు తమపై జరిగే లైంగిక వేధింపులను బయటపెట్టాలి: సింగర్ సునీత

  • పోలీసులు నిర్వహించిన ‘జాగో బదలో బోలో’ కార్యక్రమంలో పాల్గొన్న సింగర్ సునీత
  • లైంగిక వేధింపులపై మాట్లాడేందుకు సిగ్గు, బిడియం, పరువు ప్రతిష్ఠలు ఆటంకాలు
  • వీటిని వీడి వేధింపులు బయటపెట్టాలి

అమ్మాయిలు తమపై జరుగుతున్న, జరిగిన లైంగిక వేధింపులను బయటపెట్టాలని సింగర్ సునీత పిలుపునిచ్చింది. హైదరాబాదు పోలీసులు ‘జాగో బదలో బోలో’ పేరిట నిర్వహించిన యువతుల చైతన్య కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ, లైంగిక వేధింపులపై మాట్లాడేందుకు సిగ్గు, బిడియం, పరువు ప్రతిష్ఠలు ఆటంకాలని చెప్పింది. దీని వల్ల వేధింపులకు గురవుతున్న చిన్నారులు వాటిని బయటకు చెప్పుకునేందుకు అవకాశం లేకుండా పోయిందని ఆమె పేర్కొంది.

 ఇకపై అలా జరగకూడదని, ప్రతి ఆడపిల్ల తమపై జరుగుతున్న, జరిగిన లైంగిక వేధింపుల గురించి బయటపెట్టాలని సూచించింది. లైంగిక వేధింపులు, దాడులు, హింసకు వ్యతిరేకంగా ప్రతిఒక్కరూ గళం విప్పాలని కోరింది. అనంతరం హిందీ పాట ఒకటి పాడి వినిపించింది. 

  • Loading...

More Telugu News