asia: ఆసియా ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరిన అమెరికా అధ్య‌క్షుడు!

  • 11 రోజుల పాటు సాగ‌నున్న ప‌ర్య‌ట‌న‌
  • జ‌పాన్‌, ద‌క్షిణ కొరియా, చైనా, వియ‌త్నాం, ఫిలిప్పీన్స్ దేశాల్లో ప‌ర్య‌ట‌న‌
  • ప‌ర్య‌ట‌న‌కు ముందు హ‌వాయిలోని పెరల్ హార్బ‌ర్ సంద‌ర్శ‌న‌కు వెళ్లిన ట్రంప్‌

త‌న 11 రోజుల ఆసియా ప‌ర్య‌ట‌న‌కు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ బ‌య‌ల్దేరారు. జపాన్, దక్షిణ కొరియా, చైనా, వియత్నాం, పిలిప్పీన్స్ దేశాల్లో ఆయన ప‌ర్య‌టించ‌నున్నారు. గ‌త‌ 25 ఏళ్లలో ఓ అమెరికా అధ్యక్షుడు ఆసియాలో ఇంత సుదీర్ఘంగా పర్యటించడం ఇదే మొదటిసారి. ఒక‌ప‌క్క అణు ప‌రీక్ష‌లు, అణుబాంబులు అంటూ ఉత్త‌ర కొరియాతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న స‌మ‌యంలో .. ఈశాన్య ఆసియా దేశాల్లో ట్రంప్ పర్యటించనుండ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఉత్త‌ర కొరియా విష‌యంలో చైనాపై ఒత్తిడి తెచ్చే ప్ర‌య‌త్నంలో ట్రంప్ ఉన్న‌ట్లు స‌మాచారం. ఆసియా ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేర‌డానికి ముందు ట్రంప్ హ‌వాయికి వెళ్లారు. అక్క‌డ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ దాడి చేసిన పెరల్ హార్బర్ ప్రాంతాన్ని కూడా సంద‌ర్శించారు. అక్క‌డ నుంచి భాగ‌స్వామి మెలానియా ట్రంప్‌తో క‌లిసి జ‌పాన్ బయ‌ల్దేరారు. త‌ర్వాత వీరిద్ద‌రూ ద‌క్షిణ కొరియా వెళ్ల‌నున్నారు. అక్క‌డి నుంచి వియ‌త్నాం, ఫిలిప్పీన్స్ వెళ్తారు.

1991-1992 మ‌ధ్య కాలంలో అప్ప‌టి అమెరికా అధ్య‌క్షుడు జార్జ్ హెచ్ డ‌బ్ల్యూ బుష్ ఆసియా దేశాల‌కు సుదీర్ఘ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. 

  • Loading...

More Telugu News