madakasira: తెంపరి యువకులను దారిలోకి తెచ్చేందుకు హిజ్రాలను ప్రయోగించిన మడకసిర ఎస్ఐ... వీడియో చూడండి
- రహదారి నిబంధనలను పాటించని యువత
- హిజ్రాలతో క్లాస్ పీకించిన పోలీసులు
- ఎవరినీ అవమానించేందుకు కాదని వివరణ
- ప్రజలు మారుతున్నారని వెల్లడి
రహదారి నిబంధనలను ఎంతమాత్రమూ పాటించకుండా, తెంపరితనంగా వ్యవహరించే యువకులకు బుద్ధి చెప్పి, వారికి అవగాహన కల్పించేందుకు మడకసిర పోలీసులు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. పట్టుబడిన వారిలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు పట్టణ ఎస్ఐ శుభకుమార్ ఐదుగురు హిజ్రాలను రంగంలోకి దించారు.
హిజ్రాలతో ఫ్లయ్యింగ్ కిస్ లు ఇప్పిస్తూ, నడి రోడ్డుపై వారి బాధ్యతలను వారు గుర్తెరిగేలా క్లాసులిప్పిస్తున్నారు. అధిక మంది ఎక్కించుకు తిరుగుతున్న ఆటోలనూ ఆపి వారిపైకి హిజ్రాలను వదిలారు. ఇలా చేయడం వల్ల ఇంకోసారి తప్పు చేయకుండా ఉండే అవకాశాలు ఉన్నాయని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం పోలీసుల తీరును విమర్శిస్తున్నారు. కాగా, ప్రజలను అవమానించడం తమ ఉద్దేశం కాదని, మార్పుకోసం చేసిన ఓ వినూత్న ప్రయోగమే ఇదని పోలీసులు చెబుతున్నారు.