Yuvraj Singh: అమితాబ్ ముందు భావోద్వేగానికి గురైన యువరాజ్ సింగ్!
- గతంలో కేన్సర్ వ్యాధిని జయించిన యువీ
- ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ ప్రోగ్రాంలో పాల్గొని కన్నీరు
- రోజురోజుకీ ఆరోగ్యం క్షీణించింది.. క్రికెట్ ఆడవద్దని డాక్టర్లు చెప్పారు
- గత అనుభవాన్ని వివరించిన యువరాజ్‌సింగ్
క్రికెటర్ యువరాజ్ సింగ్ గతంలో కేన్సర్ వ్యాధిని జయించిన విషయం తెలిసిందే. అనంతరం ఓ ఫౌండేషన్‌ను స్థాపించి కేన్సర్ బాధితుల గుండెల్లో ధైర్యం నింపుతున్నారు. కాగా, బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్‌బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమంలో యువరాజ్ సింగ్ పాల్గొని భావోద్వేగానికి గురయ్యాడు. అమితాబ్‌తో మాట్లాడుతూ తాను కేన్సర్‌తో చేసిన పోరాటాన్ని వివరిస్తూ కన్నీరు పెట్టుకున్నాడు.
ఓ సారి తాను నిద్రలేచిన వెంటనే ఎర్ర రంగులో తెమడ బయటికి వచ్చిందని, రోజురోజుకీ తన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చిందని చెప్పాడు. తాను క్రికెట్ మానేసి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఎక్కువ కాలం బతికి ఉండలేవని వైద్యులు చెప్పారని తెలిపాడు. ఈ సందర్భంగానే యువీ కన్నీరు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోను మీరూ చూడండి..