Cricket: 54 బంతుల్లో సెంచరీ చేసిన మన్రో... టీమిండియా విజయ లక్ష్యం 197
- రాణించిన న్యూజిలాండ్ ఓపెనర్లు మన్రో 109, గుప్తిల్ 45
- ఒక్కో వికెట్ తీసిన చాహల్, హైదరాబాదీ సిరాజ్
గుజరాత్ రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతోన్న భారత్-న్యూజిలాండ్ రెండో టీ20మ్యాచ్‌లో టాస్‌గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారీ స్కోరును నమోదు చేసింది. గుప్తిల్ 45, కానె విలియమ్సన్ 12 పరుగులు చేసి ఔటయ్యారు.
క్రీజులో మన్రో భారీ షాట్లు బాదుతూ సెంచరీతో చెలరేగాడు. 54 బంతుల్లో సెంచరీ చేశాడు. టీ20ల్లో మన్రోకి ఇది రెండో శతకం. మన్రో మొత్తం 109 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టామ్ బ్రూసీ 18 పరుగుల చేశాడు. దీంతో టీమిండియా ముందు న్యూజిలాండ్ 197 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టీమిండియా బౌలర్లలో కొత్త కుర్రాడు, హైదరాబాదీ సిరాజ్ ఒక వికెట్ తీయగా, చాహల్ కూడా 1 వికెట్ తీశాడు.