japan: జపనీస్ లో రాసేందుకు ప్రయత్నించిన అమెరికా ప్రథమ మహిళ మెలానియా!
- జపాన్ ప్రథమ మహిళతో కలిసి ఓ పాఠశాలను సందర్శించిన మెలానియా ట్రంప్
- పీస్ అనే పదంలో అక్షరాలను రాసిన ఇరు దేశాల ప్రథమ మహిళలు
- మెలానియాకు రాయడం నేర్పించిన ఓ విద్యార్థిని
తమ 11 రోజుల ఆసియా పర్యటనలో భాగంగా ట్రంప్ దంపతులు ప్రస్తుతం జపాన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జపాన్ ప్రథమ మహిళ అకీ అబెతో కలిసి అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ టోక్యోలోని ఓ ఎలిమెంటరీ పాఠశాలను సందర్శించారు. అక్కడ ఉన్న 300 మంది విద్యార్థినీవిద్యార్థులు వారిని పాట పాడుతూ ఆహ్వానించారు.
తర్వాత జపనీస్ అక్షరాలను రాసేందుకు మెలానియా ప్రయత్నించారు. పీస్ (శాంతి) అనే పదంలోని అక్షరాలను జపనీస్‌లో రాయడానికి ఇరు దేశాల ప్రథమ మహిళలు ప్రయత్నించారు. మొదటి అక్షరాన్ని మెలానియా రాయగా, రెండో అక్షరాన్ని అకీ అబె రాసింది. తర్వాత అక్షరాన్ని రాయడానికి మెలానియా ప్రయత్నిస్తుండగా బ్రష్‌ను నిలువుగా పట్టుకోవాలని పక్కనే కూర్చున్న విద్యార్థిని సలహా ఇచ్చింది.