India: చైనాకు భారత్ కౌంటర్.. అధీన రేఖ వెంబడి 17 టన్నెల్స్ నిర్మాణం!
- ఇప్పటికే చేపట్టిన ఐసీబీఆర్కు ఇవి అదనం
- టన్నెల్స్ నిర్మాణంతో భారీగా తగ్గనున్న నిర్వహణ వ్యయం
- మంచు కురిసినా ఇక బేఫికర్
చైనాకు కౌంటర్ ఇచ్చే చర్యలను భారత్ ముమ్మరం చేస్తోంది. భారత్-చైనా సరిహద్దు వెంబడి 17 హైవే టన్నెల్స్ నిర్మాణానికి నడుం బిగించింది. సరిహద్దులో ఇప్పటికే చేపట్టిన ఇండియా-చైనా బోర్డర్ రోడ్స్ (ఐసీబీఆర్)కు అదనంగా వీటిని నిర్మించాలని యోచిస్తోంది.
మంచు విపరీతంగా కురిసే సమయంలో రోడ్లు మూసుకుపోవడంతో లాజిస్టిక్స్ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా వ్యూహాత్మక ప్రదేశమైన డోక్లామ్తో సంబంధాలు నిలిచిపోతున్నాయి. దీనిని నివారించి ఆర్మీకి నిత్యం రవాణా అందుబాటులో ఉండేందుకే వీటి నిర్మాణానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. టన్నెల్స్ నిర్మాణంతో నిర్వహణ వ్యయం కూడా విపరీతంగా తగ్గుతుందని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన రెండు రోజుల సెమినార్లో పేర్కొన్నారు.