elephants: ఏనుగుల దుస్థితికి దర్పణం పడుతున్న ఫొటో.... ఉత్తమ వైల్డ్‌లైఫ్ ఫొటోగా ఎంపిక
- శాంక్చుయరీ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ అవార్డ్స్ 2017
- 'హెల్ ఈజ్ హియర్' క్యాప్షన్‌తో ఫొటో తీసిన బిప్లాబ్ హజ్రా
- పశ్చిమ బెంగాల్‌లో తీసిన ఫొటో
భయంతో పరిగెడుతున్న ఏనుగు, పక్కనే దాని పిల్ల, వాటి కాళ్ల దగ్గర మంటలు... ఆ వెనకాలే మనుషులు.. పశ్చిమ బెంగాల్‌లోని బంకుర జిల్లాలో ప్రతిరోజూ కనిపించే దృశ్యానికి అద్దం పట్టే ఈ ఫొటో శాంక్చుయరీ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ అవార్డ్స్ 2017లో ఉత్తమ వైల్డ్‌లైఫ్ ఫొటోగా ఎంపికైంది. ఏనుగుల దుస్థితికి దర్పణం పడుతున్న ఈ ఫొటోను చూస్తే మనుషుల వల్ల మూగజంతువులు ఎంతెలా ఇబ్బంది పడుతున్నాయో అర్థమవుతోంది.
'హెల్ ఈజ్ హియర్' క్యాప్షన్‌తో ఈ ఫొటోను బిప్లాజ్ హజ్రా అనే ఫొటోగ్రాఫర్ తీశాడు. ముంబైకి చెందిన శాంక్చుయరీ నేచర్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ అవార్డులను అందజేసింది. ఏనుగులు నివసించడానికి చాలా పెద్ద వైశాల్యం కావాల్సి వస్తుంది. కానీ మనుషుల ఆక్రమణ వల్ల అడవుల వైశాల్యం తగ్గిపోయి, వాటి జీవనం ప్రమాదకరంగా మారుతోంది. అంతేకాకుండా ఆత్మరక్షణ కోసం మనుషులు చేసే ప్రయత్నాలు కూడా ఏనుగులకు ప్రాణహాని కలిగిస్తున్నాయి.