dmk: రేపటి నోట్ల రద్దు నిరసనలో మేము పాల్గొనం: డీఎంకే అనూహ్య ప్రకటన
- పాత పెద్దనోట్లను రద్దు చేసి రేపటితో ఏడాది
- దేశ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన విపక్ష పార్టీలు
- నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెన్నైలో డీఎంకే అధినేత కరుణానిధితో భేటీ
పాత పెద్దనోట్లను రద్దు చేసి రేపటికి సంవత్సరం పూర్తవుతోన్న నేపథ్యంలో ఎన్డీయేతర పార్టీలు రేపు దేశ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అందులో తమిళనాడు ప్రతిపక్ష పార్టీ డీఎంకే కూడా ఉంది. అయితే, నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెన్నైలో డీఎంకే అధినేత కరుణానిధిని కలిసి మాట్లాడారు.
ఈ క్రమంలో ఈ రోజు డీఎంకే ఓ ప్రకటన చేసింది. తాము రేపటి నిరసన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. వరద ప్రభావిత ప్రాంతాలైన ఎనిమిది జిల్లాల్లో నిరసన కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు చెప్పింది. ఇందులో ఏ రాజకీయ ఉద్దేశం లేదని పేర్కొంది. మరోవైపు రేపు బీజేపీ అవినీతి వ్యతిరేక దినోత్సవం నిర్వహించనుంది.