మధ్యప్రదేశ్‌: ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందేన‌ని ప‌ట్టినప‌ట్టు వ‌ద‌ల‌ని యువ‌కుడు.. మీరూ చూడండి!

  • మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఘ‌ట‌న‌
  • ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా కుడివైపు నుంచి వ‌చ్చిన జీపు
  • జీపు డ్రైవ‌ర్‌పై పోలీసు కేసు న‌మోదు
  • దేశ వ్యాప్తంగా విప‌రీతంగా వైర‌ల్ అవుతోన్న ఘ‌ట‌న‌  

ట్రాఫిక్ నిబంధ‌న‌లు పాటించ‌కుండా వ‌చ్చిన ఓ జీపు డ్రైవ‌ర్‌కి ఓ యువ‌కుడు ఇచ్చిన ఝ‌ల‌క్ సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్‌గా మారింది. చివ‌రికి ఇది పోలీసుల వ‌ద్ద‌కు చేర‌డంతో ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుపై ఎడమ వైపు నుంచి వెళ్ల‌కుండా కుడివైపు నుంచి వ‌చ్చిన జీపుని అడ్డుకుని నిల‌బ‌డ్డ ఆ యువ‌కుడికి నెటిజ‌న్లు సెల్యూట్ కొడుతున్నారు. ఇటువంటి యువ‌కులు ఉంటే దేశం ఎప్పుడో మారిపోయి ఉండేద‌ని కామెంట్లు చేస్తున్నారు.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో నిబంధ‌న‌లు అతిక్ర‌మించి వ‌చ్చిన ఓ జీపుకి అడ్డంగా యువకుడు బైక్‌ పెట్టాడు. త‌ప్పుడు మార్గంలో వ‌చ్చావ‌ని సూచించాడు. ఆ యువ‌కుడు ఎంత‌కీ ప‌క్క‌కు తప్పుకోక‌పోవ‌డంతో జీపును ముందుకు పోనిచ్చి ఆ యువ‌కుడిని భ‌య‌పెట్టాల‌ని డ్రైవ‌ర్ ప్ర‌య‌త్నించాడు. అయిన‌ప్ప‌టికీ ఆ యువ‌కుడు త‌ప్పుకోలేదు. ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందేనంటూ ఆ యువ‌కుడు మొండిగా అలాగే బైకుపై ఉండ‌డంతో అతడిపై జీపు డ్రైవ‌ర్ దాడి చేశాడు. స్థానికులు వెంట‌నే స్పందించి ఆ వాహన డ్రైవర్‌ను అడ్డుకున్నారు. పోలీసులు వచ్చి ఆ డ్రైవర్ పై కేసు నమోదు చేశారు.

 

  • Loading...

More Telugu News