YSRCP: జగన్ ఆ అవ్వకు అలా కూడా మాటిచ్చాడట.. పూర్తి వీడియో విడుదల!
- బాధలు చెప్పుకున్న అవ్వకు కొన్నాళ్లు ఓపిక పట్టాలన్న జగన్
- అవినాష్ రెడ్డి సలహాతో తేరుకుని నష్ట నివారణ చర్యలు
- అమ్మా.. అమ్మా.. అని పిలుస్తున్నా పట్టించుకోని వృద్ధురాలు
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రెండో రోజు పాదయాత్రలో ఓ వృద్ధురాలికి హామీ ఇచ్చిన వీడియో వైరల్ అవుతుండడంతో రంగంలోకి దిగిన పార్టీ శ్రేణులు పూర్తి వీడియోను విడుదల చేశాయి. సాక్షి చానల్‌లో వచ్చిన ఆ వీడియోను సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశాయి. ఆ పార్టీ మహిళా నేత రోజా కూడా తన ఫేస్‌బుక్ ఖాతాలో ఇందుకు సంబంధించిన పోస్టు పెట్టారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
వేంపల్లిలో జగన్ మాట్లాడుతున్న సమయంలో ఓ వృద్ధురాలు తన కష్టాలను జగన్‌కు వివరించింది. తనకు ఉండేందుకు గూడు, తినేందుకు తిండీ లేక అష్టకష్టాలు పడుతున్నట్టు పేర్కొంది. దీనికి స్పందించిన జగన్ రెండున్నరేళ్లు ఎలాగోలా భరిస్తే కష్టాలన్నీ తీరుస్తానని హామీ ఇచ్చారు. దీంతో పార్టీ శ్రేణులు సహా వృద్ధురాలు బిత్తరపోయి నిరాశతో వెనుదిరిగింది. జగన్ సమాధానంతో పక్కనే ఉన్న నేతలు కూడా విస్తుపోయారు.
దీంతో పక్కనే ఉన్న ఎంపీ అవినాష్ స్పందించి జగన్ చెవిలో ఏదో చెప్పారు. వెంటనే తేరుకున్న జగన్ నిరాశతో వెళ్లిపోతున్న వృద్ధురాలిని.. 'అమ్మా, అమ్మా అని పిలుస్తూ.. నీకు మరీ అంత ఇబ్బందిగా ఉంటే చెప్పు.. పులివెందులలో ఉన్న మన వృద్ధాశ్రమానికి పంపిస్తా'నని, అవినాష్‌తో చెప్పిస్తానని చెప్పారు. అయితే జగన్ మాటలను వృద్ధురాలు ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోవడం కొసమెరుపు.
వీడియో కొరకు లింక్ క్లిక్ చేయండి..