mamatha benarji: తన ట్విట్టర్ డిస్‌ప్లే పిక్చర్‌ను నల్లగా మార్చేసిన మమతా బెనర్జీ
- పాతనోట్లను రద్దు చేసి నేటికి ఏడాది
- వినూత్న రీతిలో మమతా బెనర్జీ బ్లాక్ డే
- పాత నోట్ల రద్దును ‘డీమో డిజాస్టర్’గా అభివర్ణించిన దీదీ
- సామాన్యులు ఎన్నో బాధలు పడ్డారు
పాత పెద్దనోట్లను రద్దు చేసి నేటికి ఏడాది గడుస్తోన్న నేపథ్యంలో ఎన్డీయేతర పార్టీలు నిరసన కార్యక్రమాలు జరుపుతోన్న విషయం తెలిసిందే. అవినీతిని అంతమొందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఒకరు. అప్పట్లో ఆమె పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి, మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కాగా, ఈ రోజు ఆమె తన ట్విట్టర్ డిస్ ప్లే పిక్చర్ ను నల్లగా మార్చేసి వినూత్న రీతితో నిరసన తెలిపారు. పాత నోట్ల రద్దును ‘డీమో డిజాస్టర్’గా అభివర్ణించారు. ఈ రోజు బ్లాక్ డే అని, ఈ సందర్భంగా నిరసన తెలుపుతున్నామని అన్నారు. కొందరు తమ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికే కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసిందని అన్నారు. డిమోనిటైజేషన్ పెద్ద కుంభకోణమని ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో సామాన్యులు పడ్డ బాధలు వర్ణనాతీతమని అన్నారు.
I have turned my Twitter DP black #DeMoDisaster. Let us raise our voices #Nov8BlackDay 1/2
— Mamata Banerjee (@MamataOfficial) November 8, 2017