demonitization: పెద్దనోట్లను రద్దు చేయకపోతే అవినీతిని కట్టడి చేయలేమని నేను అప్పుడే చెప్పాను: నీతి అయోగ్ సీఈవో
- పెద్ద నోట్లను రద్దు చేసిన ఏడాది తరువాత ఆసక్తికర విషయం చెప్పిన రాజీవ్ కుమార్
- 2009లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఐడియా ఇచ్చాను
- అప్పట్లో కాంగ్రెస్ చేయలేదు
- మోదీకి నేను ఈ ఐడియా ఇవ్వలేదు.. అయినా చేశారు
గత ఏడాది ఇదే రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన విషయం తెలిసిందే. అయితే, ఆయనకు ఆ ఐడియా ఇచ్చింది అర్ధక్రాంతి వ్యవస్థాపకుడు అనిల్ బొకిల్ అని ఇప్పటికే మీడియా ద్వారా అందరికీ తెలిసిపోయింది. ఆ ఐడియా గురించి మరో విషయం తాజాగా బయటకు వచ్చింది. నీతి అయోగ్ సీఈవో రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ... 2009లో తాను జాతీయ భద్రతా సలహా మండలి బోర్డులో సభ్యుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఐడియా ఇచ్చానని అన్నారు.
పెద్దనోట్ల రద్దు వంటి చర్యలు తీసుకోకపోతే దేశంలో అవినీతిని కట్టడి చేయలేమని తాను చెప్పానని అన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సూచనను పాటించలేదని చెప్పారు. ఎన్డీఏ సర్కారు మాత్రం సాహతోపేత నిర్ణయం తీసుకుందని అన్నారు. ప్రధాని మోదీకి మాత్రం తాను పెద్ద నోట్ల రద్దు గురించి ఏమీ చెప్పలేదని అన్నారు.