masood azahr: అజహర్ ఉగ్రవాది కాదని చైనా ఎందుకంటోందో చెప్పాలి: అమెరికా

  • మసూద్ అజహర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు ప్రయత్నాలు చేస్తున్న భారత్
  • భారత్ ప్రయత్నాలను ఐక్యరాజ్యసమితిలో వీటో అధికారంతో అడ్డుకుంటున్న చైనా
  • చైనా ఎందుకు అడ్డుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేసిన అమెరికా

కరుడుగట్టిన ఉగ్రవాది, జైషే మహ్మద్‌ అధినేత మసూద్‌ అజహర్‌ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు భారత్ చేసే ప్రయత్నాలను నాలుగోసారి చైనా అడ్డుకున్న వేళ ఆ దేశాన్ని అమెరికా నిలదీసింది. మసూద్ అజహర్ ఉగ్రవాది అని స్పష్టం చేసిన అమెరికా, అతనిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాల్సిందేనంటూ భారత్ కు మద్దతు ప్రకటించింది.

అజహర్‌ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను చైనా ఎందుకు అడ్డుకుంటుందో సమాధానం చెప్పాలని అమెరికా విదేశాంగ శాఖ డిమాండ్‌ చేసింది. అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ సహా మసూద్‌ అజహర్‌ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు శాశ్వత సభ్యత్వ దేశాలు సుముఖంగా ఉన్నప్పటికీ, చైనా మాత్రమే వీటో అధికారంతో అడ్డుకుంటోందని అమెరికా విదేశాంగశాఖ గుర్తు చేసింది. భారత్ లోని పఠాన్‌ కోట్‌ లో వైమానిక స్థావరంపై దాడి సహా భారత్‌ లో జరిగిన అనేక ఉగ్రదాడులకు మసూద్‌ అజహర్‌ సూత్రధారి అన్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News