Hyderabad: ‘షకీల’ అంటూ మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ను ఫేస్ బుక్ లో వేధించిన మరో మహిళ!

  • ఫేస్ బుక్ లో మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ కు వేధింపులు
  • ఫేక్ ఐడీతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిన మహిళ
  • దానిని అంగీకరించడంతో అసభ్య ఫోటోలు పోస్టు చేసి వేధింపులకు పాల్పడిన మహిళ

సాధారణంగా సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ తో అబ్బాయిలు అమ్మాయిలను వేధించడం సర్వసాధారణం. కానీ మహిళను మరో మహిళ వేధించిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన ఈ వేధింపుల ఘటన వివరాల్లోకి వెళ్తే... మౌలాలికి చెందిన మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్‌ (36) ఫేస్‌ బుక్‌ ఖాతాకు ఈ మధ్యే ‘క్రాంతికుమార్‌’ ఐడీ పేరుతో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. దానిని ఆమె స్వీకరించారు.

దీంతో ఆమె చిత్రాన్ని ఆమెకే పోస్టు చేసి ‘నెక్స్‌ ట్‌ షకీల ఇన్‌ మన టీఎఫ్‌ఐ (తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ)కి’ అంటూ పేర్కొనడం జరిగింది. అంతే కాకుండా అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. ఆ వ్యాఖ్యలు, ఫోటోలను ఆమె బంధువులు చూశారు. వాటిని చూసిన బంధువు ఒకరు ఆమెకు సమాచారం అందించడంతో ఆందోళన చెందిన ఆమె చూసుకున్నారు.

 వెంటనే ఆమె రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఫోటోలు పోస్టు చేసిన కంప్యూటర్ ఐడీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఆ కంప్యూటర్ మౌలాలి నుంచే పోస్టు అయినట్టు గుర్తించారు. దీంతో ఆరాతీయగా ప్రముఖ సంస్థలో పని చేస్తున్న సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌ చీర్ల చైతన్య (41), మద్దిలేటి శ్యామ్‌ నినిత (25) లు ఈ నిర్వాకానికి పాల్పడినట్లు గుర్తించారు. నినితతో అసిస్టెంట్ ప్రొఫెసర్ కు వ్యక్తిగత కక్షలున్న నేపథ్యంలో ఆమె ఈ రకమైన వేధింపులకు దిగినట్టు పోలీసులు తెలిపారు. చైతన్య భార్యతో కలిసి నినిత వ్యాపారం చేస్తుండడంతో అతను ఇందులో కలుగజేసుకున్నట్టు గుర్తించి, వారిని రిమాండ్ కు తరలించారు. 

  • Loading...

More Telugu News