mumbai: కస్టమర్‌పై వేడివేడి నూనె పోసిన హోటల్ యజమాని.. వీడియో విడుదల
- ముంబై శివారులోని ఉల్లాస్ నగర్‌లో ఘటన
- రోడ్‌సైడ్ హోటల్‌లో ఫుడ్ బాగా లేదన్న ఓ కస్టమర్‌పై హోటల్ యజమాని ఆగ్రహం
- ఇద్దరి అరెస్టు
సాయంత్రం పూట బజారుకి వెళ్లి రోడ్డు పక్కన ఉన్న చిన్న హోటల్‌లో టిఫిన్ చేసిన ఓ కస్టమర్‌కి చేదు అనుభవం ఎదురైంది. ఫుడ్ బాగోలేదని చెప్పినందుకు గానూ ఆ హోటల్ యజమాని వేడివేడి నూనెను ఆ కస్టమర్‌పై చల్లాడు. అయితే, ఆ కస్టమర్ వెంటనే అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించడంతో పెద్దగా గాయాలు కాలేదు. ఈ ఘటనలో హోటల్ కు చెందిన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే, ముంబై శివారులోని ఉల్లాస్ నగర్‌లో ఓ హోటల్‌లో టిఫిన్ చేసేందుకు ఓ యువకుడు వెళ్లాడు. టిఫిన్ ఆర్డర్ చేసి రుచి చూశాడు. ఆ ఫుడ్ బాగోలేదని, చట్నీలు కూడా సరిగ్గా లేవని అన్నాడు. హోటల్ యజమానితో గొడవ పెట్టుకుని, ఇతర కస్టమర్లను తినకూడదని చెప్పాడు. దీంతో ఆ హోటల్ యజమానికి, కస్టమర్‌కి మధ్య గొడవ చెలరేగింది. దీంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మీడియాకు లభించింది. మీరూ చూడండి...
#WATCH:Owner of a roadside eatery threw hot oil on a customer who complained about the food served, in Maharashtra's Ulhasnagar. 2 arrested pic.twitter.com/ypsfVKHRGn
— ANI (@ANI) November 9, 2017