Jana Reddy: ఓ పద్ధతంటూ లేకుండా పోయింది: జానారెడ్డిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు
- అక్బరుద్దీన్ ఒవైసీ కేసీఆర్ ప్రభుత్వాన్ని పొగిడారు
- ఆయన మాటలపై సీఎల్పీ నేత అభ్యంతరం చెప్పలేదు
- అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీజేఆర్ అసెంబ్లీని గడగడలాడించారు
కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ లాబీలో మాట్లాడుతూ సీఎల్పీ నేత జానారెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేశారు. అప్పట్లో 26 మంది సభ్యులతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీజేఆర్ అసెంబ్లీని గడగడలాడించారని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ పరిస్థితి అంతా మారిపోయిందని, ఓ పద్ధతంటూ లేకుండా పోయిందని మండిపడ్డారు.
అసెంబ్లీలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ టీఆర్ఎస్ ను పొగుడుతూ, కాంగ్రెస్ను తిడుతోంటే సీఎల్పీ నేత అభ్యంతరం చెప్పి ఉంటే బాగుండేదని అన్నారు. నల్గొండలో తనపై సీఎం కేసీఆర్ పోటీచేసినా తానే గెలుస్తానని, టీఆర్ఎస్ ప్రభుత్వం నల్గొండ జిల్లాకు ఏమీ చేయలేదని ఆయన అన్నారు.