roja: భయంతో హైదరాబాద్ వదిలి పారిపోయిన చంద్రబాబా... మా జగన్ ను అనేది?: రోజా ఎద్దేవా

  • ఓటుకు కోట్లు కేసులో భయపడ్డ చంద్రబాబు
  • పదేళ్లు హైదరాబాద్ లో ఉండే అవకాశాన్ని వదులుకున్నారు
  • పారిపోయి వచ్చి వైకాపాను విమర్శిస్తారా?
  • నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే రోజా 

ఓటుకు కోట్లు కేసులో తెలంగాణలో వుంటే అరెస్ట్ చేస్తారన్న భయంతో, పదేళ్ల పాటు హైదరాబాద్ ను ఉమ్మడిగా వాడుకునే సౌలభ్యమున్నా, భయపడి హైదరాబాద్ ను వదిలి పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబేనని వైకాపా ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి, విమర్శించే అవకాశాలు లేవని భయపడిన జగన్, అసెంబ్లీని బహిష్కరించాడని టీడీపీ నేతలు చేసిన విమర్శలను ప్రస్తావించిన ఆమె, భయపడిన వ్యక్తి చంద్రబాబని, హైదరాబాద్ లో ఉండలేక పారిపోయిన వ్యక్తి తమ పార్టీ అధినేతను విమర్శించడం సిగ్గు చేటని విమర్శించారు.

ఓటుకు కోట్లు కేసులో దొంగలా దొరికిపోయి, హైదరాబాద్ వదిలి అమరావతికి వచ్చి దొంగలా దాక్కున్న చంద్రబాబు, వైకాపా ఎమ్మెల్యేలను అడ్డంగా కొనుగోలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అటువంటి వ్యక్తికి జగన్ ను విమర్శించే అర్హత, అధికారం లేవని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే జగన్ ప్రజల్లోకి వెళ్లారని స్పష్టం చేశారు. జగన్ ఉన్నప్పుడు అసెంబ్లీ పెట్టడానికే భయపడ్డారని రోజా అన్నారు.

ఏ రాష్ట్రంలో లేని విధంగా బడ్జెట్ సెషన్ ను కేవలం 13 రోజులే పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని, మూడున్నరేళ్లలో కనీసం మూడు నెలలపాటైనా అసెంబ్లీని జరిపించలేదని, జగన్ ఎక్కడ తమను నిలదీస్తాడోనని అనుక్షణం టీడీపీ భయపడిందని అన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్న వేళ, 80 రోజులు అసెంబ్లీ పెట్టాలని డిమాండ్ చేసిన బాబు, అధికారంలోకి వచ్చాక అలా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News