Kajal Agarwal: అందగాడు కాకపోయినా ఫరవాలేదు .. మంచి మనసున్నవాడైతే చాలు!: కాబోయేవాడి గురించి కాజల్
- వరుస సక్సెస్ ల పట్ల కాజల్ ఆనందం
- కెరియర్ పైనే పూర్తి దృష్టి
- ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు
- భర్తగా రాబోయేవాడు అలా ఉండాలి
ఆ మధ్య కాజల్ సినిమాలు వరుసగా పరాజయాలను చవిచూస్తూ వచ్చాయి. దాంతో ఇక ఆమె కెరియర్ ముగిసిందనే టాక్ వచ్చింది. కానీ అనుకోకుండా తెలుగులో రెండు భారీ విజయాలు .. తమిళంలో ఓ బ్లాక్ బస్టర్ ను అందుకుంది. దాంతో ఆమెకి మళ్లీ వరుస ఛాన్సులు రావడం మొదలైంది. ఈ నేపథ్యంలోనే తాజా ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ, పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకి సమాధానం ఇచ్చింది.
వరుసగా పలకరిస్తోన్న సక్సెస్ లు తనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయని కాజల్ చెప్పింది. అందువలన తాను ప్రస్తుతం కెరియర్ పైనే పూర్తి దృష్టి పెట్టానని అంది. ఇంతవరకూ పెళ్లి ఆలోచన చేయలేదనీ, ఇప్పట్లో చేసుకునే ఉద్దేశం కూడా లేదని చెప్పింది. కాబోయేవాడు అందగాడు కాకపోయినా ఫరవాలేదనీ, మంచి మనసున్నవాడైతే చాలని అంది. నిజాయితీపరుడై .. తనని బాగా చూసుకునేవాడై వుండాలంటూ కాబోయే భర్త గురించి తన మనసులోని మాటను బయటపెట్టింది.