KCR: కేసీఆర్ పర్యటనలో అపశ్రుతి .. కానిస్టేబుల్ ను ఢీకొన్న వాహనం!
- జహంగీర్ పీరా దర్గాను సందర్శించుకున్న కేసీఆర్
- ఈ సందర్భంగా కానిస్టేబుల్ ను ఢీకొన్న ఇంద్రకరణ్ రెడ్డి వాహనం
- హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు షాద్ నగర్ మండలంలోని జహంగీర్ పీర్ దర్గాను సందర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దర్గాకు వస్తానని, మొక్కులు చెల్లించుకుంటానని ఆయన మొక్కుకున్నారు. ఇప్పుడు ఆయన మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీలు జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వినోద్, ఎమ్మెల్యేలు శ్రీనివాసగౌడ్, అంజయ్య యాదవ్ తదితరులు దర్గాకు వెళ్లారు.
ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ఓ కానిస్టేబుల్ ను ఢీకొంది. కీసర పోలీస్ స్టేషన్ కు చెందిన రవి కిరణ్ కు ఈ ప్రమాదంలో గాయాలయ్యాయి. వెంటనే అతడిని అత్యవసర చికిత్స నిమిత్తం హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రవికిషన్ పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.