bihar: వచ్చే ఎన్నికల్లో మా పార్టీ తరఫున తేజస్వి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటాడు!: లాలూ కీల‌క‌ ప్ర‌క‌ట‌న

  • త‌మ 2020 సీఎం అభ్య‌ర్థిని అప్పుడే ప్ర‌క‌టించిన లాలూ
  • త‌న కుమారుడు తేజస్వి సేవ‌ల‌ను కొనియాడిన ఆర్జేడీ అధినేత‌
  • తేజస్వి యాదవ్‌ను సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌డంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు  

బీహార్‌లో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జేడీయూతో క‌లిసి పోటీ చేసిన ఆర్జేడీ ప్ర‌స్తుతం ఆ పార్టీతో దోస్తీని కొన‌సాగించ‌డం లేద‌న్న విష‌యం తెలిసిందే. ఇక ఆర్జేడీ అధినేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ అప్పుడే 2020లో జ‌రిగే బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టారు. ఈ రోజు ఆర్జేడీ పార్టీ సీనియర్‌ నేతలు అబ్దుల్ బరి సిద్ధిఖి, రఘువంశ్‌ ప్రసాద్‌ సింగ్‌లతో స‌మావేశం అయిన లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

2020 బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడు తేజస్వి యాదవ్ త‌మ పార్టీ ముఖ్య‌మంత్రి అభ్యర్థిగా పార్టీని ముందుండి నడిపిస్తారని స్ప‌ష్టం చేశారు. త‌న కుమారుడు తేజస్వి పార్టీకి అందిస్తోన్న సేవ‌లు అద్భుత‌మ‌ని కొనియాడారు.

అంతకుముందు ఆర్‌జేడీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌ చందర్‌ పుర్వే బీహార్‌ తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్‌ పేరును ప్రతిపాదించగా దాన్ని ఇత‌ర నేత‌లు కొంద‌రు వ్య‌తిరేకించారు. తేజ‌స్వి యాద‌వ్‌ను సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన అంశంపై ఆర్జేడీ నేత‌ల్లో కొంత‌మంది అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం.

  • Loading...

More Telugu News