payyavula kesav: చీఫ్ విప్ లుగా పయ్యావుల, పల్లె రఘునాథరెడ్డిలను ఎంపిక చేసిన చంద్రబాబు!
- శాసనసభ చీఫ్ విప్ గా పల్లె
- శాసనమండలి చీఫ్ విప్ గా పయ్యావుల
- అందరినీ సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించిన బాబు
ఏపీ అసెంబ్లీ, శాసనమండలి చీఫ్ విప్ లను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. అసెంబ్లీ చీఫ్ విప్ గా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, శాసనమండలిలో చీఫ్ విప్ గా పయ్యావుల కేశవ్ లను ఎంపిక చేశారు. వీరి నియామకాలపై నిన్ననే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
శాసనమండలి ఛైర్మన్ గా ఇప్పటికే ఫరూఖ్ పేరును ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పల్లె రఘునాథరెడ్డి, పయ్యావుల కేశవ్ లను చంద్రబాబు అమరావతికి పిలిపించి మాట్లాడారు. అందరిని కలుపుకొని, సమన్వయంతో పని చేయాలంటూ సూచించారు.
పల్లె రఘునాథ రెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించిన సమయంలో, తనకు ఏదైనా పదవి ఇవ్వాలంటూ చంద్రబాబును ఆయన కోరారు. ఇచ్చిన హామీ మేరకు ఆయనకు చీఫ్ విప్ పదవిని ఇచ్చారు.