handicapped: వికలాంగుడు చనిపోయిన రెండేళ్లకు పిలిచిన అధికారులు.. విమర్శల వెల్లువ!
- వికలాంగ ధ్రువీకరణ పత్రం కావాలని 2015లో దరఖాస్తు చేసుకున్న బసవేశ్వరరావు
- అదే ఏడాది ఆగస్టులోనే మృతి
- 2017లో ధ్రువీకరణ పత్రం ఇస్తాం రావాలంటూ డీఆర్డీఏ అధికారుల పిలుపు
వికలాంగుడు చనిపోయిన రెండేళ్లకు వికలాంగ ధ్రువీకరణ పత్రం ఇస్తాం రావాలని పిలిచిన ఘటన అధికారుల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రానికి చెందిన చిప్పాడ బసవేశ్వరరావుకు 20 ఏళ్ల కిందట జరిగిన ప్రమాదంలో రెండుకాళ్లు దెబ్బతిన్నాయి. దీంతో వికలాంగ ధ్రువీకరణపత్రంతో కొన్నేళ్లు పింఛను పొందాడు.
అయితే ఎక్కువ శాతం వైకల్యం ఉన్న ధ్రువీకరణ పత్రం కోసం 2015లో అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. అదే ఏడాది ఆగస్టులో బసవేశ్వరరావు మృతి చెందాడు. అయితే ఆయన ధరఖాస్తు చేసిన రెండేళ్ల తరువాత ఇప్పుడు ధ్రువీకరణ పత్రం ఇస్తాం రావాలంటూ అతనికి అధికారుల నుంచి పిలుపువచ్చింది. దీంతో గ్రామస్థులు షాక్ తిన్నారు. ఇది స్థానికంగా కలకలం రేపడంతో.. చనిపోయిన రెండేళ్లకు ఎలా పిలుస్తున్నారు? అధికారుల్లో ఇంత నిర్లక్ష్యమా? అని ప్రజలు ఆశ్చర్యపోతూ మండిపడుతున్నారు.