Narendra Modi: ఫిలిప్పీన్స్ లో రామాయణ నృత్యాన్ని చూసిన నరేంద్ర మోదీ, ట్రంప్, షింజో
- రాజధాని మనీలాలో రెండు రోజులు ఆసియాన్ సదస్సు
- హాజరైన మోదీ, ట్రంప్, షింజో అబే, చైనీస్ ప్రధాని లీ కెఖియాంగ్
- అక్కడి ప్రసిద్ధ ‘సింగ్‌కిల్’ నృత్యానికి రామాయణమే ఆధారం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. అక్కడ ఆసియాన్ సదస్సు స్వర్ణోత్సవాలు జరుగుతోన్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనీస్ ప్రధాని లీ కెఖియాంగ్, జపాన్ ప్రధాని షింజో అబే హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ప్రదర్శితమవుతోన్న రామాయణాన్ని డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి మోదీ తిలకించారు.
భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ వేదికపై వేసిన ఆ ప్రదర్శనలు అందరినీ అలరించాయి. రెండు రోజులు జరిగే ఆసియాన్ సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా ఈ వేడుకను నిర్వహించారు. రామాయణాన్ని అక్కడ ‘మహారదియా లవాన’ (రావణ) అంటారు. ఆ దేశంలో ప్రసిద్ధ ‘సింగ్‌కిల్’ నృత్యానికి కూడా రామాయణమే ఆధారం.