asaduddin oyc: శ్రీ శ్రీ రవిశంకర్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన అసదుద్దీన్ ఒవైసీ
- వివాదాస్పద అయోధ్య విషయంలో మధ్యవర్తిత్వం చేస్తానన్న రవిశంకర్
- ఆయనను జోకర్‌గా అభివర్ణించిన అసదుద్దీన్
- రవిశంకర్‌కి ఎలాంటి అధికారం లేదు
- ముందు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ విధించిన జరిమానా కట్టుకో
అయోధ్యలో ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న 'అయోధ్యలో రామమందిరం లేక మసీదు నిర్మాణం' విషయంలో తాను మధ్యవర్తిత్వం చేస్తానని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ ఇటీవల తెలిపారు. ఈ వివాద పరిష్కారంలో తన వంతు కృషి చేస్తానని, అక్కడకు వెళతానని కూడా ఉన్నారు. ఆయనకు షియా వక్ఫ్ బోర్డు పూర్తి మద్దతు తెలిపింది.
అయితే, ఈ విషయంపై స్పందించిన ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, రవిశంకర్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్య వివాదంలో ఆయన దౌత్యం అవసరం లేదని తేల్చి చెప్పారు. ఆయన మధ్యవర్తిత్వం ఓ జోక్ అని హేళన చేశారు. ఈ విషయంలో రవిశంకర్‌కి ఎలాంటి అధికారం లేదని, ఆయనో జోకర్ అని వ్యాఖ్యానించారు.
ఆయన మధ్యవర్తిత్వాన్ని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా ఒప్పుకోలేదని తెలిపారు. రవిశంకర్ మొదట నదీతీరాన వేడుకలు నిర్వహించినందుకు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ విధించిన జరిమానాను కట్టాలని అసదుద్దీన్ సలహా ఇచ్చారు.