bandla ganesh: బడి ఎగ్గొట్టి సినిమాలు చూసేవాడిని .. అందుకే చదువు పెద్దగా రాలేదు: బండ్ల గణేష్
- స్కూల్ ఏజ్ లో షాద్ నగర్లో దొంగతనంగా ట్రైన్ ఎక్కేవాడిని
- హైదరాబాద్ వచ్చి సినిమాలు చూసేవాడిని
- పెద్దగా చదువబ్బలేదు
- నా పిల్లలు బాగా చదువుతారు
తెలుగు తెరకి నటుడిగా పరిచయమై .. చిన్న చిన్న పాత్రలు చేస్తూ బండ్ల గణేష్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత ఆయన నిర్మాతగా మారి .. భారీ సినిమాలతో అగ్రనిర్మాతగా ఎదిగారు. స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ వచ్చిన ఆయన, ఇటీవల కాలంలో సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో తనకి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు.
"నేను ఇంటర్మీడియెట్ ఫెయిలయ్యాను .. చదువు వచ్చేది కాదు ..ఏం చేయమంటారు? 6 .. 7వ క్లాస్ ల నుంచే స్కూల్ కి అని చెప్పేసి ఇంటి నుంచి బయలుదేరి, షాద్ నగర్ లో దొంగతనంగా ట్రైన్ ఎక్కేసి హైదరాబాద్ వచ్చేవాడిని. ఓ రెండు సినిమాలు చూసేసి సాయంత్రానికి ..స్కూల్ నుంచి వెళ్లినట్టుగా ఇంటికి చేరుకునేవాడిని. ఇక చదువేం వస్తుంది చెప్పండి? నాకు ఇద్దరు అబ్బాయిలు .. ఒక అమ్మాయి .. అంతా బాగా చదువుతారు" అంటూ చెప్పుకొచ్చారు