jignesh: హార్దిక్ పటేల్ సిగ్గు పడాల్సిన అవసరం లేదు.. శృంగారమనేది ప్రాథమిక హక్కు: దళిత నేత జిగ్నేశ్
- హార్దిక్ పటేల్‌పై వీడియో వైరల్
- హార్దిక్ కు బాసటగా నిలిచిన గుజరాత్ దళిత నేత
- వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే హక్కు ఎవ్వరికీ లేదని వ్యాఖ్య
పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కోసం పోరాడుతోన్న హార్దిక్ పటేల్ ఓ అమ్మాయితో సన్నిహితంగా ఉన్నటువంటి వీడియో ఒకటి కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన హార్దిక్ పటేల్, ఆ వీడియోలో ఉన్నది తాను కాదని చెప్పారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొందరు కావాలనే ఇటువంటి కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఈ క్రమంలో, గుజరాత్ దళిత నేత జిగ్నేశ్ మెవాని హార్దిక్‌కు మద్దతుగా నిలిచి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో సిగ్గు పడాల్సిన అవసరం లేదని, శృంగారమనేది ప్రాథమిక హక్కు అని వ్యాఖ్యానించారు. అసలు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే హక్కు ఎవ్వరికీ లేదని, హార్దిక్ పటేల్ ఈ విషయంలో బాధపడవలసిన అవసరం లేదని పేర్కొన్నారు.