vayu tanay: 'నేనే ముఖ్యమంత్రి' షూటింగ్ మొదలు

  • మోహన్ రావిపాటి దర్శకుడిగా 'నేనే ముఖ్యమంత్రి'
  • ఈ రోజున రామానాయుడు స్టూడియోలో ప్రారంభం
  • రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ 
  • 40 రోజుల్లో షూటింగ్ పూర్తి  

మోహన్ రావిపాటి దర్శకత్వంలో ఆలూరి సాంబశివరావు నిర్మాణంలో 'నేనే ముఖ్యమంత్రి' సినిమా .. ఈ రోజునే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. హైదరాబాద్ .. రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. దర్శకులు ఎన్.శంకర్ కెమెరా స్విచాన్ చేయగా .. జీవిత రాజశేఖర్ క్లాప్ ఇవ్వగా .. తొలి సన్నివేశానికి తమ్ముడు సత్యం గౌరవ దర్శకత్వం వహించారు.

వాయుతనయ్  .. శశి .. దేవిప్రసాద్ ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా దర్శకుడు మోహన్ రావిపాటి మాట్లాడుతూ, పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా చెప్పారు. రేపటి నుంచి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది .. 15 రోజుల పాటు ఇక్కడ కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తామని అన్నారు. ఆ తరువాత కందుకూరు .. వైజాగ్ ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతామని, 40 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ముగిసేలా ప్లాన్ చేశామని చెప్పుకొచ్చారు.     

  • Loading...

More Telugu News